Anganwadi Posts: ఇంటర్ పాసైతే చాలు.. అంగన్‌వాడీ ఉద్యోగం.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అంగన్‌వాడీ పోస్టుల(Anganwadi Posts) భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
- V Santhosh Kumar
- Published on- July 9, 2026 / 06:03 PM IST
Telangana government releases notification to fill 15,982 Anganwadi posts
- అంగన్‌వాడీ పోస్టుల భారీ భర్తీ
- వివాహిత మహిళలకే ఉద్యోగ అర్హత
- జులై 27 దరఖాస్తు గడువు
Anganwadi Posts: తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో అంగన్‌వాడీ(Anganwadi Posts) టీచర్, అంగన్‌వాడీ ఆయా ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 179 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్‌తో పాటు ములుగు, నల్గొండ, గద్వాల, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
Bandi Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
అర్హతలు, ఎంపిక విధానం:
* విద్యార్హత: దరఖాస్తుదారులు తప్పకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. స్థానికంగా ఇంటర్ అభ్యర్థులు లేకపోతే 10వ తరగతి చదివిన వారికి అవకాశం కల్పించనున్నారు.
* వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ముఖ్య నిబంధన: ఖాళీ ఉన్న కేంద్రం పరిధిలోని స్థానిక వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ద్వారా 100 మార్కులకు ఈ ఎంపిక జరుగుతుంది. ఇందులో ఇంటర్ మార్కులకు 70%, అనాథలకు 10%, వితంతువులకు 5%, దివ్యాంగులకు 5% వెయిటేజీతో పాటు 10 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జులై 27, 2026 చివరి తేదీ. అర్హులైన మహిళలు తమ విద్యార్హత, నివాస, కుల ధృవీకరణ పత్రాలతో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టే ఈ పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా వేలాది మంది మహిళలకు స్థానికంగానే ఉపాధి లభించనుంది.
