Indiramma Indlu Scheme: పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కోసం సింగల్ విండో.. ఇకపై ఫీజులన్నీ రద్దు

పట్టణ ప్రాంతాల్లోని బలహీన , అల్పాదాయ వర్గాల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Scheme) నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana government to accelerate construction of Indiramma houses in urban areas

  • పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.
  • గృహ నిర్మాణ ఫీజుల రద్దు.
  • సింగిల్ విండో అనుమతుల మంజూరు.

Indiramma Indlu Scheme: పట్టణ ప్రాంతాల్లోని బలహీన , అల్పాదాయ వర్గాల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల (Indiramma Indlu Scheme)నిర్మాణానికి సంబంధించిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తూ, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి ‘సింగిల్ విండో కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2016 నాటి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ మార్గదర్శకాల ఆధారంగా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు.

Meerut Murder Case: మరో భర్త బలి.. నిద్ర మాత్రలు ఇచ్చి, పాముతో కరిపించి.. మీరట్ లో భార్య ఘాతుకం

సింగిల్ విండో కమిటీ:

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్యకార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో టీజీహెచ్‌బీ (TGHB), హెచ్‌ఎండీఏ (HMDA), మున్సిపల్ కమిషనర్లు, జలమండలి, విద్యుత్ డిస్కంలు, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను ‘బిల్డ్‌నౌ’ విధానం ద్వారా స్వీకరించి, నిర్ణీత గడువులోగా అనుమతులు, నిరభ్యంతర పత్రాలు (NOC) జారీ చేసే బాధ్యతను ఈ కమిటీ చూసుకుంటుంది. ఏవైనా అభ్యంతరాలుంటే దరఖాస్తుదారునికి ఒకేసారి తెలియజేస్తూ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా ఈ కమిటీ పనిచేస్తుంది.

భారీగా ఫీజుల రద్దు.. వేగంగా అనుమతులు:

ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ప్రాసెసింగ్, డెవలప్‌మెంట్, బెటర్‌మెంట్, లేఅవుట్‌ అప్రూవల్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, సిటీ లెవల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫీజులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అయితే ఈ మినహాయింపులు కేవలం బలహీన, అల్పాదాయ వర్గాల పట్టణ గృహనిర్మాణ పథకాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. పర్యావరణ, పౌర విమానయాన శాఖల అనుమతులకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఈ మొత్తం పథకానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని డీటీసీపీ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.