×
Ad

Hyderabad Metro: ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్-ఎల్ అండ్ టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

  • Published On : February 23, 2026 / 09:12 PM IST

Hyderabad Metro Representative Image (Image Credit To Original Source)

 

  • మెట్రో టేకోవర్ ప్రాసెస్ మరింత వేగవంతం
  • ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం
  • మార్చి 31లోగా టేకోవర్ పూర్తి
  • మెట్రో రెండో దశ విస్తరణకు లైన్ క్లియర్

Hyderabad Metro: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై ఒక స్పష్టమైన నివేదికను రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్-ఎల్ అండ్ టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

మెట్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులపై చర్చించారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో టేకోవర్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది. మార్చి చివరిలోగా హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశకు లైన్ క్లియర్ అయ్యింది.

హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచన చేసింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేందుకు మెట్రో 2 విస్తరణకు ప్రభుత్వం భావించింది. మెట్రో ప్రభుత్వం చేతిలో ఉంటేనే విస్తరణకు అనుమతులు సులభం అవుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు మెట్రోను నిర్వహించలేము అని ఎల్ అండ్ టీ కూడా చెప్పింది. ఈ క్రమంలో మెట్రోను పూర్తిగా టేకోవర్ చేసేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్స్ ను పరిశీలించిన తర్వాత.. మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తి స్థాయిలో టేకోవర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ప్రస్తుతం మూడు లైన్లు అందుబాటులో ఉన్నాయి. మియాపూర్ టు ఎల్బీనగర్, రాయదుర్గం టు నాగోల్, ఇమ్లిబన్ బస్ స్టేషన్ టు జూబ్లీ బస్ స్టేషన్.. ఈ మూడు లైన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావించింది. కొత్తగా వచ్చే లైన్లు లక్డీకాపూల్ టు లింగంపల్లి, మియాపూర్ టు పటాన్ చెరు, నాగోల్ టు ఎల్బీనగర్ వయా చాంద్రాయణగుట్ట, ఇమ్లీబన్ బస్ స్టేషన్ టు శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. ఈ కొత్త లైన్లలో మెట్రో విస్తరణ చేస్తే నగరంలో ప్రజలకు రవాణ వ్యవస్థ మరింతగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: అప్పుడే గ్రేటర్‌పై బీఆర్ఎస్ గురి.. అసలు కారు స్ట్రాటజీ ఏంటి?