Telangana government : తెలంగాణలో మరో కొత్త పథకం..! ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు

Telangana government : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది.

CM Revanth Reddy

Telangana government : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 19వ తేదీన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : Hyderabad Traffic Alert : హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. చార్మినార్ వైపు వెళ్తున్నారా? ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

కేబినెట్ భేటీ తరువాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఈనెల 19వ తేదీన సిద్ధిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచే పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తహసీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారని చెప్పారు.

ఈనెల 19న సిద్దిపేట వేదికపై నుంచి ఇందిరమ్మ చీరలు రెండో విడత పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మరోవైపు దీపావళి పండుగ రోజున సీఎం రేవంత్ రెడ్డి నుంచి సర్పంచ్ వరకు వారి పరిధిలోని మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా ఒక ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ -2026 నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.