IAS Transfers: తెలంగాణలో 12 మంది IAS అధికారుల బదిలీలు.. రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు!

తెలంగాణ ప్రభుత్వం 12 మంది సీనియర్ ఐఏఎస్(IAS Transfers) అధికారులను బదిలీ చేస్తూ కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.

Telangana government transfers 12 senior ias officers reshuffle in key departments

IAS Transfers: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల(IAS Transfers) స్థానచలనానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో పనిచేస్తున్న 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ (GAD) మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు సీనియర్ అధికారులకు ప్రాధాన్యత ఉన్న శాఖల బాధ్యతలతో పాటు అదనపు పోస్టింగ్‌లను కూడా కేటాయించింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cm Chandrababu: ‘అర్నబ్’ తుపానుతో ఏపీకి భారీ నష్టం.. వెంటనే కేంద్ర బృందాలను పంపండి.. అమిత్‌షాకు చంద్రబాబు కీలక లేఖ

సీనియర్ అధికారులకు కీలక శాఖల బాధ్యతలు.. ప్రధాన నియామకాల వివరాలు:

ఈ ఉత్తర్వుల ప్రకారం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్, విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణీ ప్రసాద్, పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్ మిత్తల్ నియమితులయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న దానకిశోర్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా కె. ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.

అదనపు బాధ్యతలు & విభాగాల పునర్వ్యవస్థీకరణ.. తక్షణమే ఉత్తర్వులు అమలు:

పరిపాలనా వేగాన్ని పెంచడంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా సంక్షేమ, ఎస్సీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్రుతి ఓజా, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్‌కు టీజీ రెడ్కో వీసీగా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ పౌరసేవల వ్యవస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు.