Telangana Job Notification 2026 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 6000కు పైగా ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

Telangana Job Notification 2026 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 6 వేల ఉద్యోగాల భర్తీకి కోసం

telangana Government will soon release job notification 2026 for to fill 6000 vacancies

Telangana Job Notification 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధం అవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. శాఖల వారీగా ఖాళీల వివరాలు తెప్పించుకుని.. సమీక్షించేందుకు సర్వీస్ కమిషన్ త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటి వరకు కార్యదర్శికి అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 6 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రేవంత్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్లు పెంచుతూ.. గరిష్ఠంగా 44 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఆరు వేల పోస్టుల్లో ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ..

  • ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు: 1,000 కి పైగా అధ్యాపక పోస్టులు
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు: 300 కి పైగా అధ్యాపక పోస్టులు
  • పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో (DIET): 100 కి పైగా అధ్యాపక ఖాళీలు
  • జూనియర్ కళాశాలలు: జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల (PET) ఖాళీలు.

వీటితో పాటు దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్‌మెంట్, ఆర్టీసీ, పురపాలక శాఖల్లో ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి.. ఆర్టీసీ ఎండీ ఇప్పటికే కమిషన్‌కు లేఖ రాశారు. అలానే పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా..

ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించబోయే పోటీ పరీక్షల్లో ఇక నుంచి కొత్త విధానాన్ని పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకే తేదీ, సమయాల్లో రెండు పరీక్షలు రాయాల్సి వచ్చి అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రస్థాయి పరీక్షలు, యూపీఎస్సీ (UPSC), ఎస్ఎస్‌సీ (SSC) వంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులందరూ టీజీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.

అలానే ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ప్రతి రెండు వారాలకొకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల అర్హత ఉన్న అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందిన పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.

త్వరలోనే విడుదల చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్‌డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. దీనికోసం గతంలోనే గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.