Telangana Govt : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..

Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో నెం. 38ను విడుదల చేసింది.

Telangana Govt

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
  • ఉద్యోగుల బదిలీపై నిషేదం ఎత్తివేత
  • మే1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీకి అనుమతి

Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో నెం. 38ను విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. ఒకేచోట మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులుగా పేర్కొంది. ఒకేచోట నాలుగేళ్లు దాటితే తప్పనిసరి బదిలీలు ఉంటాయని తెలిపింది. 21 మే 2027కి ముందే రిటైర్ అయ్యే వారికి బదిలీల విషయంలో మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read : KCR HYDRAA : KCR సంచలన వ్యాఖ్యలు.. ‘హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం.. తొలి సంతకం దాని మీదనే’

ఒక్కో కేడర్‌లో గరిష్ఠంగా 40శాతం మందికే బదిలీలు ఉంటాయని, భార్యాభర్తలు, వికలాంగులు, వైద్య కారణాలకు ప్రాధాన్యం ఉంటుందని, క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుందని, బదిలీలు పూర్తిగా కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. ఆన్‌లైన్/వెబ్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలు
నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

ఖాళీల జాబితా, అర్హుల జాబితా ముందుగానే ప్రకటించడం జరుగుతుందని, ఉద్యోగుల నుంచి ఐదు ఆప్షన్లను తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కష్ట ప్రాంతాలకు సిబ్బంది లేనిపక్షంలో లాటరీ విధానంలో కేటాయింపు చేయడం జరుగుతుందని, బదిలీ ఉత్తర్వులు వచ్చిన మూడు రోజుల్లో రిలీవ్ అయినట్లు పరిగణంలోకి తీసుకోవటం జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేదం అమలు ఉంటుందని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నియమావళి ప్రకారం నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.