Telangana Govt : రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం.. రెండు లక్షల మందికి శుభవార్త..

Telangana Govt : రాష్ట్రంలోని అర్హులైన వారికి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్ల కోసం వేచిచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది.

cheyutha pension eligibility

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • రెండు లక్షల మందికి కొత్త పెన్షన్లు
  • జూన్ నెల నుంచి పంపిణీకి ఏర్పాట్లు

Telangana Govt : రాష్ట్రంలోని అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొన్నేళ్లు పెన్షన్ల కోసం వేచిచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు లక్షల మందికి చేయూత పథకం ద్వారా నెలనెలా పింఛన్లను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక వారందరికీ సొంత ఇళ్లు రాబోతున్నాయ్.. హైదరాబాద్‌సహా ఆ జిల్లాల్లో కేటాయింపులు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన వారికి పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా లక్ష మందికి పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026-27) రెండు లక్షల మందికి పెన్షన్లు కొత్తగా జారీ చేస్తామని బడ్జెట్ ప్రంసగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బడ్జెట్లో వీటికి నిధులను కూడా కేటాయించారు. ఈ క్రమంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 42.23 లక్షల మంది నెలనెలా పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోధకాలు బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ.4,016గా ఇస్తున్నారు.

గత మూడేళ్లుగా బోధకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరుకాకపోవడంతో అర్హులైన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో జూన్ నెలలో కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో భారీ మొత్తంలో పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. అయితే, ఇందులో కేవలం రెండు లక్షల మంది అత్యంత అర్హులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్ఠమైన వడపోత కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కొత్త పెన్షన్ల‌కోసం దాదాపు 12లక్షల మంది వేచి చూస్తున్నారు. వీరిలో రెండు లక్షల మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.