Telangana Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తలు తప్పనిసరి
తెలంగాణలో (Telangana Rains)రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- V Santhosh Kumar
- Updated on- June 14, 2026 / 09:20 PM IST
Telangana heavy rain warning IMD Hyderabad weather update
- తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక జారీ
- రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరణ
- ఈదురుగాలులు వర్ష సూచన ఉన్నాయి
Telangana Rains: తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, అయితే ఇవి వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Sabarimala Gold Scam: శబరిమల గోల్డ్ స్కామ్ కేసు.. తుది దశలో SIT కీలక తనిఖీలు
అదే విధంగా ఈ నెల 18 నుంచి 20 తేదీల మధ్య భారీ వర్షాలు(Telangana Rains) పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పనులు ప్లాన్ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణతో వాతావరణం మరింత చల్లబడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
