Sabarimala Gold Scam: శబరిమల గోల్డ్ స్కామ్ కేసు.. తుది దశలో SIT కీలక తనిఖీలు
కేరళలోని పత్తనంతిట్టలో ఉన్న శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్కామ్ కేసు(Sabarimala Gold Scam) దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది.
Sabarimala gold scam SIT final stage inspection and evidence collection before charge sheet filing
- SIT తుది దశ దర్యాప్తు
- ఆలయ బంగారం నమూనా పరీక్షలు
- చార్జిషీట్ దాఖలు సిద్ధం
Sabarimala Gold Scam: కేరళలోని పత్తనంతిట్టలో ఉన్న శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్కామ్ కేసు(Sabarimala Gold Scam) దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది దశలో భాగంగా ఆదివారం మరోసారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది. ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఆధారాలను మరింత బలంగా చేయడం కోసం ఆలయంలోని ఆభరణాలు, లోహపు వస్తువులను శాస్త్రీయంగా పరీక్షిస్తోంది. ముఖ్యంగా ప్రభామండలం ప్లేట్లు, ద్వారపు ఫ్రేమ్లను విప్పి నమూనాలు సేకరించేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
FSSAI: ‘హెల్తీ’ పేరుతో మోసం? FSSAI కఠిన చర్యలతో ఫుడ్ కంపెనీలకు షాక్.. 8 కంపెనీలకు నోటీసులు
ఈ నమూనాలను గతంలోనే సేకరించి జంషెడ్పూర్లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)కు పంపించారు. అక్కడి నివేదికల ఆధారంగా ఆభరణాల్లో ఎంత మేర బంగారం ఉపయోగించబడిందనే అంశంపై SITకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఆలయ నిర్మాణం, మార్పుల సమయంలో జరిగిన లోపాలు, నిబంధనల ఉల్లంఘనపై కూడా దర్యాప్తు దృష్టి సారించింది.
2025లో ద్వారపాలకుల విగ్రహాల తొలగింపు అంశం కూడా ఈ కేసులో కీలక భాగంగా మారింది. ఈ దశ దర్యాప్తు దాదాపు పూర్తయిందని, త్వరలోనే తుది నివేదిక (చార్జిషీట్) దాఖలు చేస్తామని SIT కోర్టుకు తెలిపింది. కేసులో తదుపరి పరిణామాలు, నేర నిర్ధారణ అంశాలపై సమీక్ష కోసం హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.
