TG ICET Results 2026 : తెలంగాణ ఐసెట్ ఫలితాల విడుదల.. మీ రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET Results 2026) 2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది.

Telangana icet 2026 results

  • తెలంగాణ ఐసెట్ 2026 ఫలితాల విడుదల
  • ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ ప్రారంభం
  • ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు కీలకం

TG ICET Results 2026: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET Results 2026) 2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారికంగా విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఫలితాలను ప్రకటించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి ర్యాంక్ కార్డులను పొందవచ్చు. ఫలితాల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠకు తెరపడింది.

Nara Lokesh: రప్పా.. రప్పా అంటే ఊరుకోం.. మంత్రి లోకేశ్ ఫైర్.. రెడ్ బుక్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. టీజీ ఐసెట్-2026 నిర్వహణ బాధ్యతలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ చేపట్టింది. మే 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం అధికారులు ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించారు. తుది ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజాగా ఫలితాలను ప్రకటించారు.

అభ్యర్థులు అధికారిక https://icet.tgche.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా త్వరలోనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అభ్యర్థులు తదుపరి అడ్మిషన్ ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు.