Indiramma Housing Phase 2: ఇందిరమ్మ ఇల్లు.. రెండో ఫేజ్ లో ముందు ఇచ్చేది వీళ్లకే

తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే 'ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Phase 2)' రెండో విడత మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది.

Telangana indiramma houses phase key update by minister ponguleti srinivasa reddy

  • గుడిసెల వాసులకే మొదటి ప్రాధాన్యం.
  • రూఫ్ రీప్లేస్‌మెంట్‌కు రూ.2 లక్షలు.
  • చిన్న స్థలాల్లో జీ+1 ఇళ్లకు అనుమతి.

Indiramma Housing Phase 2: తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ రెండో విడత(Indiramma Housing Phase 2) మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని స్పష్టం చేశారు.

Indiramma Houses: పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం.. ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నయా ప్లాన్

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 వేల మంది గుడిసెల వాసులు ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు ఉంటే, వారు ఇప్పుడు నేరుగా స్థానిక ఎంపీడీవో (MPDO) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని గుడ్‌న్యూస్ చెప్పారు. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను అధిగమించడానికి, చిన్న స్థలాలు ఉన్న లబ్ధిదారుల అవసరాన్ని బట్టి ‘గ్రౌండ్ ప్లస్ వన్’ ($G+1$) అంతస్తుల నిర్మాణాలకు కూడా అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు, ప్రమాదకరమైన పైకప్పుల కింద నివసిస్తున్న వారి కోసం ప్రభుత్వం ‘రూఫ్ రీప్లేస్‌మెంట్’ (పైకప్పు మార్పిడి) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లకు ఆర్సీసీ ($RCC$) స్లాబ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే గత ప్రభుత్వాల హయాంలో గృహలక్ష్మి లేదా ఇతర పథకాల కింద మంజూరై, మధ్యలోనే నిలిచిపోయిన అసంపూర్తి ఇళ్లను కూడా ‘రూఫ్ అప్‌గ్రేడేషన్’ ద్వారా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.