Indiramma Houses: పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం.. ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నయా ప్లాన్
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) పథకం ద్వారా పేదలకు గృహ వసతి కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
Telangana indiramma housing scheme mig houses on hold
- పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం.
- ఎంఐజీ గృహాలపై సర్కారు పునరాలోచన.
- స్థలాలు ఖరారయ్యాకే అపార్ట్మెంట్ డిజైన్లు.
Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ వసతి కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అల్పాదాయ (LIG/SIG), మధ్య ఆదాయ (MIG) వర్గాలకు సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి మధ్య ఆదాయ వర్గాల (MIG) ఇళ్ల ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. మొదట అల్పాదాయ వర్గాల వారికే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, ఆ తర్వాతే ఎంఐజీ ఇళ్లపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం యోచిస్తోంది.
SBI Land Dispute: రాయదుర్గం భూవివాదం.. వెయ్యి కోట్ల వేలంపై SBI పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్
పట్టణ ప్రాంతాల్లోని అల్ప, మధ్య ఆదాయ వర్గాల కోసం గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోనే దాదాపు లక్ష ఇళ్లను నిర్మించాలని సర్కారు గతంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. జనావాసాలకు దూరంగా కాకుండా, నగరంలోని 24 నియోజకవర్గాల్లోనే స్థలాలను సేకరించి వీటిని నిర్మించాలని హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 15 చోట్ల స్థలాలను గుర్తించగా, మిగిలిన 9 నియోజకవర్గాల్లో స్థలాల వేట సాగుతోంది. అయితే పూర్తిస్థాయిలో స్థలాలు ఖరారు కాకుండానే అధికారులు సిద్ధం చేసిన అపార్ట్మెంట్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అన్ని నియోజకవర్గాల్లో స్థలాలు దొరికిన తర్వాతే డిజైన్లను ఫైనల్ చేయాలని ఆదేశించారు.
మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో యాదాద్రి, కరీంనగర్ (చిన్న ముల్కనూర్) జిల్లాల్లో పక్కా ఇళ్ల పేరుతో కూల్చివేసి, ఇప్పటికీ నిర్మించని ఇళ్ల(Indiramma Houses)పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను చేసిన పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇచ్చిన గృహ హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం ఎక్కడెక్కడ ఇళ్ల హామీలు ఇచ్చారు, వాటిలో అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే పూర్తి నివేదికను సిద్ధం చేసే పనిలో గృహనిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
