×
Ad

Kavitha: నార్సింగిలో కవిత ధర్నా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

నార్సింగిలోని ఓ వెంచర్‌ వద్ద స్థానికులతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha).

Telangana Jagruthi president Kavitha dharna at Narsingi

Kavitha; నార్సింగిలోని ఓ వెంచర్‌ వద్ద స్థానికులతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందులో భాగంగా హైడ్రా అధికారులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేస్తున్న అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అయితే, కవిత ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే జాగృతి కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట చోటు జరిగింది.

Donald Trump: ఆ దేశ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది.. ఇరాన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అంతకుముందు మూసి నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ వెంచర్‌ వద్దే బైఠాయించారు కవిత(Kavitha). చీకటి పడ్డాక సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో సైతం ఆమె ధర్నాని కొనసాగించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. మూసీని ఆనుకుని భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారని, పేదల ఇళ్లు కూలుస్తూ రియల్‌ ఎస్టేట్‌వెంచర్లను వదిలేస్తున్నారని ఆమె మండిపడ్డారు.