×
Ad

Kavitha : మైడియర్ బ్రదర్ అంటూ కేటీఆర్ మీద కవిత ఫుల్ ఎటాక్.. ఇది కరెక్ట్ కాదంటూ హెచ్చరిక

Kavitha : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. నామీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా..? తెలిసి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha

  • బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూడొద్దు
  • రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాను
  •  దేవుడి ఆశీర్వాదంగానే ఈ తీర్పు వచ్చింది.

Kavitha : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ కేసు కారణమని అర్థం వచ్చేలా కేటిఆర్ ట్విట్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ వాళ్లు కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నామీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా..? తెలిసి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్, కవితకు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

నేను అరెస్టు అయిన సమయంలో కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టలేదని కవిత ప్రశ్నించారు. ఈ కేసును ఆనాడు నేను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాకు సపోర్ట్ చేయలేదు. బీజేపీ వాళ్ళు బతుకమ్మ ప్లేస్‌లో లిక్కర్ బాటిళ్లు పెట్టిన నాడు బీఆర్ఎస్ పార్టీ ఎటు పోయింది? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నేను కారణమా..? ప్రజలు కూడా నా గురించి ఆలోచన చేయాలి. దోపిడిదారులకు టికెట్లు వద్దని చెప్పినా ఆనాడు ఒప్పుకోలేదు. ఇవాళ వచ్చిన తీర్పును బీఆర్ఎస్ వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ అంటూ కవిత సూచించారు.

నాకు పార్టీ ఎక్కడ సపోర్ట్ చేసింది. నన్ను బ్లేమ్ చేయకండి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నా మెడలో పార్టీ ఓటమి వేయాలని చూస్తే ప్రజలు హర్షించరని కవిత అన్నారు. రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాను. దేవుడి ఆశీర్వాదంగానే ఈ తీర్పు వచ్చిందని కవిత అన్నారు.

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఏది చెబితే అది చెల్లుతుంది అనుకోవద్దు. ఆడబిడ్డ పట్ల సోషల్ మీడియాలో అడ్డమైన పేర్లు పెట్టి అడ్డ గాడిదలాగా వ్యవహరించిన వాళ్లకు తగిన సమయంలో సమాధానం చెబుతామంటూ కవిత హెచ్చరించారు. ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయేంత వీక్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉందా.. తెలంగాణ సాధించిన పార్టీ ఒక వ్యక్తితో ఓడిపోతుందా అంటూ కవిత ప్రశ్నించారు.  రెండు నెలల్లో పార్టీ పెట్టబోయే ముందు ఈ తీర్పు రావడం సంతోషంగా ఉంది.. నాకు ప్రకృతి కూడా సహకరిస్తుందని కవిత అన్నారు.

ఆ కేసు వల్ల నాకు, మా కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది. న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెబుతున్నా. మా అమ్మకు, మా నాన్నకు, మా అత్తమామలకు, మా భర్త తరఫున కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. మీరు ఇచ్చిన బలంతోనే జైల్లో ఐదున్నర నెలలు గడిపానని కవిత అన్నారు.