Telangana Wine Shops (1)
Telangana Liquor Shops: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. లాక్‌డౌన్ ప్రకటించేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ అన్నీ కార్యకలాపాలు సాగుతాయని ఆ తర్వాత బంద్ అయిపోతాయని చెప్పారు. వైన్ షాపులపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో మందుబాబులు బారులు తీరుతూ మద్యం షాపుల ముందు తంటాలు పడ్డారు.
వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తామని చెప్పింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ అన్నీ దుకాణాలు తెరిచిన సమయంలోనే వైన్ షాపులు కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించింది.
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉండగా.. లాక్‌డౌన్ ప్రకటన చేసేసింది తెలంగాణ ప్రభుత్వం.. ముందస్తు ప్రచారం మొదలవగానే.. ఈలోపే మందు తెచ్చుకుంటే బెటరని భావించిన మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినేట్ పది రోజులు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోగా.. వైన్స్ ముందు మందుబాబులు క్యూ పెరిగిపోయింది.
రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మందు షాపుల ముందు క్యూలో నుంచున్నారు.