Telangana Mahindra University lockdown: లాక్‌డౌన్‌లో యూనివర్సిటీ.. 30మందికి కొవిడ్ పాజిటివ్

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరీ జిల్లాలో మహీంద్రా యూనివర్సిటీకి లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. 25మంది స్టూడెంట్లకు కొవిడ్ పాజిటివ్

Mahindra

Telangana Mahindra University lockdown: తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరీ జిల్లాలో మహీంద్రా యూనివర్సిటీకి లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం.. 25మంది స్టూడెంట్లకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారితో పాటు ఐదుగురు టీచింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. ఎవరిలోనూ అంత సీరియస్ లక్షణాలు కనిపించడం లేదు.

1700మంది స్టూడెంట్లు, ఫ్యాకల్టీ ఉన్న మహీంద్రా యూనివర్సిటీకి ఈ సందర్భంగా లాక్ డౌన్ ప్రకటించారు. వర్సిటీ అందరూ వ్యాక్సినేషన్ వేయించుకున్నారని తెలిపింది. క్యాంపస్ తో పాటు హాస్టల్స్ కు శానిటైజేషన్ చేసిన తర్వాతే అకడమిక్ యాక్టివిటీస్ పునరుద్ధరిస్తామని నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ సమీపంలోని బహదూరపల్లి వద్ద ఉంది ఈ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్. మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నిర్వహిస్తుండగా.. టెక్ మహీంద్రా ఇందులో సబ్సీడరీగా వ్యవహరిస్తుంది.