Muncipal Elections Results : మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఉత్కంఠ.. డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా కమ్యూనిస్టులు, స్వతంత్రులు
Mahabubabad Municipality : మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది.
- Harishth Thanniru
- Published On : February 13, 2026 / 02:38 PM IST
Mahabubabad Municipality
- మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఉత్కంఠ
- మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- కీలకంగా మారిన కమ్యూనిస్టులు, స్వతంత్రులు
- వారు ఎవరివైపు మద్దతు పలికితే వారిదే మున్సిపల్ పీఠం
Muncipal Elections Results : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అయితే, మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం హంగ్ ఏర్పడింది. కనిస్టులు, స్వతంత్రులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారారు.
Also Read : Muncipal Elections Results 2026 : నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. మున్సిపాలిటీ ఫలితాల్లో క్లీన్‌స్వీప్
మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 12 వార్డుల్లో, బీఆర్ఎస్ అభ్యర్థులు 13వార్డుల్లో విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థులు మూడు వార్డుల్లో, సీపీఐ అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ ఒక వార్డులో విజయం సాధించగా.. స్వతంత్రులు నాలుగు వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది
మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలంటే కమ్యూనిస్టులు లేదంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అవసరం. దీంతో కమ్యూనిస్టులు, స్వతంత్రులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా మారారు. ఈ క్రమంలో ఎవరికి వారే చైర్మన్ పీఠం కోసం డిమాండ్ చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కించుకునేలా ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఒకవైపు కమ్యూనిస్టులతో, మరోవైపు స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలుసైతం రంగంలోకి దిగడంతో మహబూబాబాద్ మున్సిపాల్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందనే అంశం ఉత్కంఠగా మారింది.
