TGPSC Notification: TGPSC నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Notification) అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

Telangana Public Service Commission releases two notifications.

  • రెండు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు
  • మొత్తం ఇరవైతొమ్మిది ప్రభుత్వ పోస్టులు
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

TGPSC Notification: తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Notification) అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని రెండు కీలక ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం కమిషన్ వేర్వేరుగా రెండు కొత్త నోటిఫికేషన్లను జారీ చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ, అలాగే తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో కలిపి మొత్తం 29 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

Gold Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?

నోటిఫికేషన్ 1: అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్:

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మల్టీ-జోనల్ కేడర్ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

* మొత్తం ఖాళీలు: 10 పోస్టులు

* దరఖాస్తు తేదీలు: జూలై 10, 2026 నుండి ఆగస్టు 17, 2026 వరకు (ఆన్‌లైన్ ద్వారా).

* వయోపరిమితి: జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

* నెలవారీ జీతం: రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు లభిస్తుంది.

* విద్యార్హతలు: B.Arch, B.E/B.Tech (సివిల్), B.Planning లేదా B.Tech (Planning) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా M.A/M.Sc (Geography), M.Sc (Geoinformatics) తో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులు.

నోటిఫికేషన్ 2: సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్:

తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది.

* మొత్తం ఖాళీలు: 19 పోస్టులు

* దరఖాస్తు తేదీలు: జూలై 7, 2026 నుండి ఆగస్టు 12, 2026 వరకు.

* వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు.

* నెలవారీ జీతం: రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు అందుతుంది.

* విద్యార్హతలు: ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ ఉండాలి. దీనితో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో M.Sc (Ag.) పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షా విధానం, సిలబస్, రిజర్వేషన్ల సడలింపులు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషన్ స్పష్టం చేసింది.