Telangana Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
- chvmurthy
- Updated on- January 7, 2022 / 09:52 PM IST
TS Covid Update
Telangana Covid Update : తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.98 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది.
రాష్ట్రంలో ఇంత వరకు 6,89,751 మందికి కోవిడ్ సోకగా, వారిలో 6,75,851 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 క్రియాశీల కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో కోవిడ్ తదితర కారణాలతో ఈరోజు ముగ్గురు మరణించటంతో ఇంతవరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,039 కి చేరింది.
Also Read : Delhi’s Covid Cases : కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతున్న ఢిల్లీ
జీహెచ్ ఎంసీ పరిధిలో ఈరోజు కొత్తగా 1,452 కోవిడ్ కేసులు… రంగా రెడ్డి జిల్లాలో 218 , మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 232 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
