×
Ad

Telangana Covid Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 277 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 731 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 435 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • Published On : May 31, 2022 / 10:07 PM IST

Telangana Covid Report

Telangana Covid Update : తెలంగాణలో క్రితం రోజుతో పోలిస్తే కరోనా కొత్త కేసుల స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 203 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 59 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 44 కొవిడ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 277 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 731 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 435 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 11వేల 474 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 42మందికి పాజిటివ్ గా తేలింది.