TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. టికెట్ ధరలు భారీగా తగ్గింపు
ఏసీ బస్సుల్లో టికెట్ రేట్లు తగ్గించిన తెలంగాణ ఆర్టీసీ(TGSRTC).
- V Santhosh Kumar
- Published On : February 26, 2026 / 05:01 PM IST
Telangana RTC reduces ticket rates in AC buses
- హైదరాబాద్ ప్రజలకు సమ్మర్ కానుక
- ఏసీ బస్సులో చార్జీలు తగ్గింపు
- మార్చి 1 నుంచి అమలు
TGSRTC: తెలంగాణ ప్రజలకు సమ్మర్ కానుకగా ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎండాకాలం మొదలవడంతో ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు(TGSRTC). ఏయే బస్సుల్లో ఎంత తగ్గించారు, ఆ ఛార్జీలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Mahabubnagar: మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. సంబరాలు చేసుకున్న గిరిజన సంఘాలు
హైదరాబాద్ మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో కిలోమీటర్లకు గాను టికెట్ ఛార్జీ రూ.30గా ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ.25కి తగ్గించారు. ఇక ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో నాలుగు కిలోమీటర్లకు గాను రూ.35 చొప్పున ధర ఉండగా.. ఇప్పుడు దానిని రూ.25కి తగ్గించారు. ఈ బస్సులో ఏకంగా రూ.10 మేర తగ్గనుండటం ప్రయాణికులకు మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాటి ఛార్జీల తగ్గడం వల్ల నగర ప్రజలకు లబ్ది చేకూరనుంది.
