Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటినుంచి వరుసగా 3 రోజులు సెలవలు

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays)వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telangana schools colleges three days holidays august bonalu

  • విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు
  • బోనాల పండుగతో లాంగ్ వీకెండ్
  • ఆగస్టులో మొత్తం పదకొండు సెలవులు

Holidays: తెలంగాణలోని పాఠశాలలు, కాలేజీల విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం కావడం వల్ల విద్యాసంస్థలకు సాధారణంగానే సెలవులు ఉంటాయి. ఇక ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు వేడుకల కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. క్యాలెండర్‌లో సెలవుగా పేర్కొన్నప్పటికీ, అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

Telangana High Court: ఉచిత పథకాలపై ‘తెలంగాణ హైకోర్టు’ తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను సోమరులను చేస్తున్నారు.. ఇది చాలా ప్రమాదం

ఆగస్టు నెలలో లభించనున్న మొత్తం సెలవుల వివరాలు:

ఈ ఆగస్టు నెలలో విద్యార్థులకు పండుగ వాతావరణంతో పాటు అత్యధికంగా మొత్తం 11 రోజులు సెలవులు(Holidays)గా రానున్నాయి. వీటిలో 5 ఆదివారాలు, 3 సాధారణ ప్రభుత్వ సెలవులు, 3 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఆగస్టు 10న బోనాల పండుగ, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 26న ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలను ప్రభుత్వం సాధారణ సెలవులుగా నోటిఫై చేసింది. బోనాల సెలవుపై విద్యాశాఖ తుది ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే స్పష్టత రానుంది.