No Fuel Shortage In Telangana : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదు.. నెల రోజులకు సరిపడా నిల్వలు: పెట్రోల్ ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్
No Fuel Shortage In Telangana : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని.. మరో నెల రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు.
- Dharani Pilli
- Published On : March 25, 2026 / 02:36 PM IST
telangana state petrol tank owners association president rajashekhar reddy on fuel crisis
No Fuel Shortage In Telangana : హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వార్తలు ప్రచారం అవుతుండటంతో.. జనాలు అవసరం ఉన్నా లేకపోయినా.. వాహనాల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారు. కొందరైతే క్యాన్లలో కూడా నింపుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పెట్రోల్ ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నెల రోజుల వరకు పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 3 వేల ట్రక్కుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాం. మరో నెల రోజుల వరకు పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉంది. వినియోగదారులు ఆందోళన చెందవద్దు అని తెలిపారు. తప్పుడు ప్రచారాల కారణంగా బంకుల వద్ద రద్దీ పెరిగి విక్రయాలు 3 రెట్లు పెరిగాయని… దీంతో కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు తగ్గుతున్నాయే తప్ప అసలు కొరత లేదని తెలిపారు.
ఇదిలా ఉంటే నేటి మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
