Telangana Summer Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈ సారి భారీగా వేసవి సెలవులు.. ఎప్పటి నుంచంటే…!
Telangana Summer Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎప్పటి నుంచంటే..
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 12:24 PM IST
telangana summer holidays for 2026 announced to schools from april 24 to june 11
- తెలంగాణ విద్యార్థులకు శుభవార్త
- వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
Telangana Summer Holidays 2026 : 2025-2026 విద్యా సంవత్సరం చివరకు చేరుకుంది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో వేసవి సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థులంతా సమ్మర్ హాలిడేస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. వార్షిక పరీక్షలు పూర్తి కాగానే సెలవులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే వేసవి సెలవులను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి. అంటే జూన్ 12 నుంచి 2026-2027 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న వారు.. సొంతూరి ప్రయాణానికి రెడీ అవుతున్నారు. ఎండల నేపథ్యంలో ముందుగానే సెలవులు ప్రకటించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
