Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే మూడ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
Telangana Weather updates : రుతుపవనాల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Updated on- July 12, 2026 / 07:48 AM IST
Telangana Weather updates
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- మూడ్రోజులు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Weather updates : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Visakhapatnam Earthquake : విశాఖలో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగుల తీసిన ప్రజలు
రుతుపవన ద్రోణి ప్రస్తుతం శ్రీ గంగానగర్, రోహ్‌తక్, షాజహాన్‌పూర్, బస్తీ, ముజఫర్‌పూర్ మీదుగా, అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా మణిపూర్ వైపుగా విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తెలంగాణ నుండి కర్ణాటక తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిలకు జారీ చేసింది. గంటలకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇదిలాఉంటే.. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతులు సాగు పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కాలేకపోతున్నారు. విత్తనాలు నాటాలంటే భూమిలో తేమశాతం ఉండాలి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు భారీ వర్షాలు నమోదు కాలేదు. దీంతో భారీ వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.
