TG Inter Results 2026 Date: రేపే ఇంటర్ ఫలితాలు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఎన్ని గంటలకంటే.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..
TG Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
- Harish Thanniru
- Updated on- April 11, 2026 / 04:12 PM IST
TS Inter Result 2026 date
- తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
- రేపే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు
- సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా విడుదల
TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు (12వ తేదీన) ఫలితాలు వెల్లడించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం నూతన సిలబస్ పుస్తకాలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.
Also Read : తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఆ ఉచిత పథకం మళ్లీ వస్తోంది.. ఇసారి మరింత అందంగా
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది ఉండగా.. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు.
సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే ముగిసింది. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయి లైన విద్యార్థుల సమాధానపత్రాలను ఈసారి కూడా మళ్లీ మూల్యాంకనం చేశారు. ఆ ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తయింది. దీంతో ఫలితాల విడుదలకోసం ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఇలా తెలుసుకోండి..?
- TSBIE అధికారిక వెబ్సైట్ క్లిక్ చేయండి. https://tgbie.cgg.gov.in/
- Inter Results 2026 లింక్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
- Submit బటన్‌ను క్లిక్ చేయండి
- ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
