TGSRTC MeSeva App : ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్‌పై ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లలో ప్రయాణం.. ముందస్తుగానే బుక్ చేసుకోవచ్చు..

TGSRTC MeSeva App : ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌గా ‘మీ టికెట్’ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకేచోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్ తో పాటు తమ గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదంటే క్యాబ్ ను కూడా ముందస్తుగానే బుక్ చేసుకునే వీలుంటుంది.

TGSRTC MeSeva App

TGSRTC MeSeva App : ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మీ సేవ ఆధ్వర్యంలో వినూత్నంగా మీ టికెట్ (Mee Ticket) యాప్ ను టీజీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఒకే టికెట్ పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Also Read : Hyderabad Traffic Diversion : కేబీఆర్​ పార్కు చుట్టూ వన్​-వే అమల్లోకి‌.. ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే..

ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌గా ‘మీ టికెట్’ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకేచోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్ తో పాటు తమ గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదంటే క్యాబ్ ను కూడా ముందస్తుగానే బుక్ చేసుకునే వీలుంటుంది. అంటే ఒకే టికెట్ పై బస్సు లేదా మెట్రో లేదంటే ఆటో, క్యాబ్ లలో ప్రయాణించేఅ వకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయాణికులకు సులభంగా, వేగవంతంగా తమ గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.

ఈ యాప్ లో చెల్లింపుల ప్రక్రియను కూడా చాలా సులభతరం చేశారు. ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా విభాగాలు, భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా జమచేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతోపాటు రవాణా భాగస్వాములకు కూడా లావాదేవీల ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది.

తెలంగాణలో త్వరలో‌నే ‘మీ సేవ’ యాప్‌లో మీ టికెట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజారవాణా సేవలైన ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్.. ఇక నుంచి అన్ని ఒకే యాప్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా ప్రయాణికుడు ఒకేచోట నుంచి ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లో తన గమ్యస్థానానికి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దీని ఛార్జీలను కూడా ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో చెల్లించ వచ్చని తెలిపింది.

ఆర్టీసీ ఆటోలపై క్లారిటీ..
తెలంగాణ ఆర్టీసీ సొంతగా ఎల‌క్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి నడపనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. ఇలాంటి ఆలోచన ఆర్టీసీకి లేదని, భవిష్యత్లో కూడా ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీగా చెప్పేసింది.

ఫిలింనగర్ వెళ్లాలంటే..
ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిలింనగర్ వైపు వెళ్లే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద ఎడమవైపు తిరిగి ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆస్పత్రి, అగ్రసేన్ చౌరస్తా మీదుగా చుట్టూ తిరిగి ఫిలింనగర్ చేరుకోవాల్సి ఉంటుంది. మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వారికి చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్ మీదుగా వెళ్లే మార్గంలో పెద్దగా మార్పులు లేవని అధికారులు తెలిపారు.

యూసుప్‌గూడ నుంచి పెద్దమ్మతల్లి టెంపుల్ వైపు వెళ్లేవారు..
యూసఫ్ గూడ నుంచి పెద్దమ్మతల్లి టెంపుల్ వైపు వెళ్లేవారు.. ఇక నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ద్వారా వెళ్లలేరు. యూసూఫ్‌గూడ నుంచి వెళ్లేటప్పుడు డోమినోస్ ఫిజా సెంటర్ దాటి కొంచెం ముందుకు వెళ్లిన తరువాత కుడివైపు రోడ్డుకు తిరగాలి. అక్కడ నుంచి నేరుగా వెళ్తే.. హైటెక్ సిటీ వెళ్లే రోడ్డుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హైటెక్ సిటీతోపాటు.. పెద్దమ్మ తల్లి‌గుడి వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది.