కొందరు ఎన్నికల్లో ఓడినా సీటు వదలడం లేదు.. సమాజం కోసం శాంతి కళ్యాణం : చిన్న జీయర్ స్వామి
Chinna Jeeyar Swamy : తెల్లాపూర్ మైం హోమ్ గ్రూప్ త్రిదశలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
- Dharani Pilli
- Updated on- May 8, 2026 / 02:45 PM IST
The 3rd annual Brahmotsavams of Sri Rukmini Satyabhama Sameta Sri Mohana Krishna Swamy at My Home Tridasa in Tellapur hyderabad
Chinna Jeeyar Swamy : తెల్లాపూర్ మైహోమ్ త్రిదశలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో కల్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ శాంతి కళ్యాణం కన్నులపండువగా జరిగింది. భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. “బయట ఎండలు మండిపోతున్నాయి. రాజకీయపరమైన మంటలు మండిపోతున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడాలని ఈరోజు శాంతి కళ్యాణం నిర్వహించాం. ప్రస్తుతం దేశంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి.. ఈ ఎలక్షన్లలో ఓడిపోయినా సరే.. కొందరు సీటు వదలడం లేదు” అన్నారు.
అలాగే మరికొందరు ప్రపంచం ఏమైనా, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు.. తమ మాటే నెగ్గాలని భావిస్తున్నారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎలా ఎదుర్కోవాలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా చెప్పారు. శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలి అని తెలిపారు.
