×
Ad

Minister KTR Leg Fracture : మంత్రి కేటీఆర్ కాలికి గాయం-మూడు వారాలు విశ్రాంతి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.

  • Published On : July 23, 2022 / 06:16 PM IST

Minister Ktr

Minister KTR Leg Fracture :  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది. దీంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలిని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీ కి సంబంధించి ఎవరైన తనకు సలహా ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ లో కోరారు.

ఈ రోజు ఉదయం ప్రగతి భవన్ లో  కేటీఆర్  నేలమీద  జారి కింద పడ్డారు. దీంతో ఆయన వెంటనే యశోదా అస్పత్రికి వెళ్లారు.  అక్కడ   వైద్యులు  పరీక్ష చేయగా ఎడమ  కాలి చీల మండలో   కొద్ది పాటి చీలిక వచ్చినట్లు గుర్తించారు.  వెంటనే చికిత్స చేసి  ఆయనను తిరిగి  ఇంటికి పంపించారు. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

కాగా రేపు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఇలా జరగటంతో ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ పడ్డారు. ఇప్పటికే కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హోర్డింగ్ లు, బ్యానర్లు కట్టారు.