Wanaparthy : అయ్యో దేవుడా.. మరీ ఇంత దారుణమా.. 150 ఎకరాల మామిడి తోట.. కానీ కుటుంబం మొత్తం ఆత్మహత్య..
Wanaparthy : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 27, 2026 / 05:49 PM IST
total four family members ends their life financia debt mango crop lost in ghanpur wanaparthy district
- వనపర్తి జిల్లాలో దారుణం
- కౌలుకి తీసుకుని 150 ఎకరాల మామిడి తోట సాగు
- పంట నష్టం, అప్పుల బాధతో కుటుంబం అంతా ఆత్మహత్య
Wanaparthy : ఈ దేశంలో పాలకుల నుంచి ప్రకృతి వరకు ప్రతి ఒక్కరూ మోసం చేసే ఒకే ఒక్క వ్యక్తి అన్నదాత. ఎవ్వరి మీదా ఆధారపడడు.. ఆరుగాలం శ్రమించి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. అప్పులు చేసి మరీ పంట సాగు చేస్తాడు. దేశానికే అన్నం పెట్టే రైతన్న కడుపు నిండా తింటున్నాడా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. పంట సాగు మొదలైన నాటి నుంచి కల్తీ విత్తనాలు, పురుగు మందులు, కూలీ ఖర్చుల పెరుగుదల వంటి కష్టాలను దాటుకుని పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం సరైన ధర పెట్టదు. చేసేది లేక దళారుల చేతిలో దగాకు గురవుతాడు. పోనీ మంచి ధర ఉంది, పంట బాగుంది, ఈ సారి అప్పులు తీరతాయి అని భావిస్తే నేనున్నాను అంటూ प्रकृति కన్నెర్ర చేస్తుంది. ఫలితం చేతికందిన పంట నోటికి చేరకుండానే నీటి పాలవుతుంది.
మనకు రూపాయి నష్టం వస్తేనే గగ్గోలు పెడతామే.. మరి పంటలను చంటిపాపలా, కంటిపాపలా చూసుకున్న రైతన్న, అది కాస్తా మన్ను పాలైతే ఏం చేస్తాడు.. ఇదిగో ఈ కుటుంబం తీసుకున్నట్లు దారుణానికి పాల్పడతారు. 150 ఎకరాల మామిడి తోట సాగు చేస్తున్న ఓ అన్నదాత కుటుంబం పంట నష్టం, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
ఈ విషాదకర వార్త వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం, సల్కాలాపూర్ గ్రామంలో మే 27, బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి తన భార్య పుష్పలత, కుమార్తె (15), కుమారుడి(17)తో కలిసి సల్కాలాపూర్ గ్రామంలో 150 ఎకరాల మామిడి తోటను గుత్తకు తీసుకున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా వీరు సల్కాలాపూర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.
ఈసారి పంట దిగుబడి బాగుంటుందని భావించిన నర్సింహకు అనుకోని అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గత కొన్నాళ్లుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో తోటను గుత్తకు తీసుకుంటే అది కాస్తా నష్టాలను మిగల్చడంతో నర్సింహకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పులు తీర్చలేనని అర్థం అయ్యింది. ఇప్పటికే ఫైనాన్సర్లు అప్పు చెల్లించాల్సిందిగా వేధిస్తున్నారు.
ఈ సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం అని భావించిన నర్సింహ.. కుటుంబం అంతా కలిసి సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుమార్తె, కొడుకును చంపి సంపు (నీటి తొట్టి)లో వేశాడు. ఆ తర్వాత నర్సింహ, అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు నర్సింహ సెల్ఫీ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. అప్పుల బాధకు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
