Hyderabad Traffic : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ సమయాల్లో అస్సలు వెళ్లొద్దు..
Hyderabad Traffic : హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. ముగ్ద జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- Harishth Thanniru
- Published On : February 27, 2026 / 09:03 AM IST
Hyderabad Traffic
- హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ముగిసే వరకు కొనసాగనున్న ఆంక్షలు
Hyderabad Traffic : హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. ముగ్ద జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ప్లైఓవర్, అండర్ పాస్ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సిటీ పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ముగిసేవరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేటు, ముగ్ద జంక్షన్ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సిటీ పోలీసులు సూచించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు:
ఎన్ఎఫ్‌సీఎల్ నుంచి వచ్చే వాహనాలు..
శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ -36 అండ్ 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -5, వెంకటగిరి ఎక్స్‌రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 అండ్ 45 నుంచి వచ్చే వాహనాలు..
జూబ్లీహిల్స్ రోడ్ నం.36, 45 నుంచి ఎన్ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లే వారు..జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్-2, యూసుఫ్ గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.
KCP, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 నుంచి వచ్చే వాహనాలు..
KCP, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.
మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలు..
కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.
సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో (ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు) ఈ మార్గాల్లో ప్రయాణించొద్దని, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులను అనుసరించాలని, తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్(Google Maps మొదలైనవి) ఉపయోగించండని పోలీసులు సూచించారు.
