Hyderabad Traffic Alert : వాహనదారులు ఇక తప్పించుకోలేరు.. ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కేసులే..!

Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో 1,339 కేసులు నమోదయ్యాయి. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసిన 1,005 మందితో పాటు మైనర్ డ్రైవింగ్‌పై 334 కేసులు రిజిస్టర్ అయ్యాయి.

Hyderabad Traffic Alert

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..
  • హైదరాబాద్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • ఫ్రీ లెఫ్ట్ అడ్డుకున్నారా? మైనర్లకు వాహనం ఇచ్చారా?
  • మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలపై ఫోకస్

Hyderabad Traffic Alert : వాహనదారులకు ఇక చుక్కలే.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే తప్పించుకోలేరు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. మీరు వెళ్లే దారిలో కొంచెం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నారు.

ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ తనిఖీల్లో ఇప్పటివరకూ ఏకంగా 1339 కేసులు నమోదయ్యాయి. రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు. ఆగస్టు 12 నుంచి 18 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా వేలల్లో కేసులు నమోదు అయ్యాయి.

జంక్షన్ల వద్ద రూల్స్ బ్రేక్ చేస్తున్నవారిపై నిఘా పెట్టారు. ఫ్రీ లెఫ్ట్ మార్గాలను బ్లాక్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాలు ఫ్రీగా ముందుకు సాగేందుకు ఫ్రీ లెఫ్ట్‌ ఏర్పాటు చేస్తే.. కొందరు వాహనదారులు అక్కడే తమ వాహనాలను నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. తద్వారా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలా ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసిన 1,005 మంది వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also : Telangana Movie Tickets : టికెట్ ధరలపై తెలంగాణలో థియేటర్ల వార్.. ప్రభుత్వ జీఓపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం!

అదేవిధంగా, వాహనాలను మైనర్లు నడుపుతున్న ఘటనలపై కూడా ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి 334 కేసులు రిజిస్టర్ అయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పేరెంట్స్, వాహనదారులను పోలీసులు గట్టిగా హెచ్చరించారు.

ఇకపై మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అలా చేస్తే పిల్లలతో పాటు వాహన యజమానులపైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని సూచించారు.

అది అందరి బాధ్యతని, ఏ కొద్ది నిర్లక్ష్యం చేసినా ప్రాణాలను తీస్తుందని పోలీసులు హెచ్చరించారు. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా రోడ్డు భద్రతను పెంచేలా ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.