Kamareddy : దారుణ ఘటన.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియురాలి కొడుకును హతమార్చిన ప్రియుడు

Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం బాలుడు ప్రాణాలను బలిగొంది.

Tragic incident in Kamareddy district

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాద ఘటన
  • కొడుకు ప్రాణాలు బలిగొన్న తల్లి వివాహేతర సంబంధం
  • ప్రియురాలి కొడుకును హత్యచేసిన ప్రియుడు

Kamareddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం బాలుడు ప్రాణాలను బలిగొంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి ఐదేళ్ల కొడుకును ప్రియుడు హతమార్చాడు. ఈ ఘటన శ్రీరాంనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read : Kukatpally Private Travels bus : కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు

అభంశుభం తెలియని ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. భర్తతో గొడవల కారణంగా రాజంపేటకు చెందిన ఓ మహిళ కొంతకాలంగా కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో తన కూతురు, ఐదేళ్ల కుమారుడు శ్రావణ్ లతో కలిసి ఉంటోంది. ఆమె గత ఆరు నెలలుగా నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కూతురిని పుట్టింటి వద్ద వదిలేయవచ్చు.. కానీ, బుద్దిమాంద్యంతో బాధపడుతున్న కొడుకు శ్రావణ్ మాత్రం తమ వివాహేతర సంబంధాని అడ్డు వస్తున్నాడని మహిళ, నర్సింహులు భావించారు.

ఎలాగైనా శ్రావణ్ అడ్డు తొలగించుకోవాలని నర్సింహులు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ లేని సమయంలో మద్యం తాగి వచ్చిన నర్సింహులు మత్తులో ఐదేళ్ల బాలుడు కళ్లలో కారం చల్లి.. ఆ తరువాత కర్రతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ విషయమై బాలుడి బాబాయి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాలుడు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.