Hyderabad Bus Fire KPHB: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు
Hyderabad Bus Fire Accident : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు తీవ్రమవ్వడంతో బస్సు పూర్తిగా దగ్దమైంది.
Kukatpally Hyderabad Bus Fire Accident KPHB
- కేపీహెచ్‌బీ పరిధిలో ఘోర ప్రమాదం
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
- బస్సు దగ్దం.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
Hyderabad Bus Fire: హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels bus) లో మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు తీవ్రమవ్వడంతో బస్సు (Bus) పూర్తిగా దగ్దమైంది. అయితే, అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులును బస్సు సిబ్బంది అప్రమత్తం చేయడంతో వారంతా సురక్షితంగా బస్సు నుంచి బయటకు దిగారు. బస్సు మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీదుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం రాత్రి మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్లేందుకు బయలుదేరింది. బస్సు కేపీహెచ్‌బీ సమీపంలోని పద్మావతి ప్లాజా బస్‌స్టాప్ వద్ద ఆగింది. అప్పటికి సమయం రాత్రి 10.45 అయింది. ఆ సమయంలో ఉన్నట్లుండి క్యాబిన్లో మంటలు రావడాన్ని బస్ డ్రైవర్ గమనించాడు. మంటలు చెలరేగాయంటూ బస్సులోని సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బస్సులోని ప్రయాణికులను వేగంగా కింది దింపేశారు.
బస్సుకు మంటలు వ్యాపించిన సమయంలో అందులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని కిందికి కిందికి దింపిన కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్దమైంది. అయితే, బస్సులో మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రధాన రోడ్డుపై బస్సుకు మంటలు వ్యాపించి దగ్దమవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
కేపీహెచ్‌బీ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా, మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద బస్సులో చెలరేగిన మంటలు
పాలకొల్లు వెళ్లాల్సిన (NL02B9955) గా గుర్తింపు
అప్రమత్తమై ప్రయాణికులను దింపేసిన సిబ్బంది
ఘటనా… pic.twitter.com/MZq4P0YoZy
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2026
