Passenger Burnt Alive : నల్లగొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రయాణికుడు సజీవ దహనం
పట్టణ సమీపంలోని నార్కెట్ పల్లి - అద్దంకి హైవేపై అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.
- bheemraj
- Published On : December 4, 2023 / 09:36 AM IST
Travels bus caught fire
Passenger Burnt Alive : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు సజీవ దహనం అయ్యాడు. పట్టణ సమీపంలోని నార్కెట్ పల్లి – అద్దంకి హైవేపై అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.
హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపేసి ప్రయాణికులను దింపాడు. నిమిషాల్లోనే ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు సజీవ దహనం అయ్యాడు.
Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
