Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Michaung Cyclone (1)

Michaung Cyclone Effect : ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచివుంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచాంగ్ తుఫాను కదులుతోంది. గంటకు 13 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలో మీటర్లు, బాపట్లకు 360 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 380కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది.

మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు (సోమవారం), రేపు (మంగళవారం) కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురువనున్నాయి.

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక
రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 -100 కిలో మీటర్లు, సాయంత్రం నుంచి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.

CYCLONE

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో మారిన వాతావరణం

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో వాతావరణ పరిస్ధితులు మారాయి. పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సముద్రంలో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలతో రైతులు అందోళన చెందుతున్నారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు.

Michaung Cyclone : నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఎడతెరిపి లేకుండా కరుస్తోన్న వర్షం, రెడ్ అలెర్ట్

ఉప్పాడ జెడ్పీ హై స్కూల్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు
ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. యుద్ధ ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా 16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జెడ్పీ హై స్కూల్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రానికి హోప్ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు. తుఫాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షిస్తున్నారు.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్ తో పాటుగా కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు కలెక్టరేట్ -18004253077, కాకినాడ ఆర్డీవో కార్యాలయం-9701579666, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం-9949393805.

CHENNAI