Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

women win

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీకి ఈసారి పది మంది మహిళలు వెళ్లనున్నారు. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పది మంది మహిళలు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళలు గెలుపొందారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి అదనంగా నలుగురు మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం పది మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మీ, నార్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు.

Telangana Congress : ఇవాళ సీఎల్పీ సమావేశం.. సాయంత్రమే సీఎం ప్రమాణ స్వీకారం!

లాస్య నందిత ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ పై 17, 169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోవ లక్ష్మీ ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరాశ్యామ్ పై 22,798 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరాడ్డిపై 8,855 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సబితా ఇంద్రారెడ్డి ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుపై 26,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సీతక్క ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొండా సురేఖ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై 15,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పద్మావతిరెడ్డి ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యపై 58,172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యశస్వినీరెడ్డి.. ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ రావుపై 46,367 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మట్టా రాగమయి.. ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట వీరయ్యపై 19,440 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.