Telangana Congress : ఇవాళ సీఎల్పీ సమావేశం.. సాయంత్రమే సీఎం ప్రమాణ స్వీకారం!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

Telangana Congress : ఇవాళ సీఎల్పీ సమావేశం.. సాయంత్రమే సీఎం ప్రమాణ స్వీకారం!

Telangana Congress

Telangana Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తరువాత అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్ననది గవర్నర్ కు తెలియజేస్తారు.

Also Read : AP Politics : టీడీపీకి లాభమేనా? తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీ రెడీ అయ్యింది. ఇవాళ సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాయంత్రమే తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అయితే సీఎం రేస్‌లో రేవంత్‌రెడ్డితోపాటు.. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లాంటి నేతలు ఉన్నప్పటికీ.. రేవంత్ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈరోజు ఉదయం 9.30గంటలకు సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని.. మెజార్టీ ఎమ్మెల్యేల సూచించిన పేరును సీఎల్పీ నేతగా ప్రకటిస్తారు. ఈ రోజు సాయంత్రమే తెలంగాణ నూతన సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్‌ ఉంది.

Also Read : Bandi Sanjay : నాకు చాలా హ్యాపీగా ఉంది, రేవంత్ రెడ్డి గొప్ప ఫైటర్- ఓటమిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.