Bandi Sanjay : నాకు చాలా హ్యాపీగా ఉంది, రేవంత్ రెడ్డి గొప్ప ఫైటర్- ఓటమిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

కరీంనగర్‌లో‌ ముస్లింలందరూ ఒకటయ్యారు. బండి ‌సంజయ్ ‌మీద ముస్లింలు కక్ష కట్టారు. మూడు‌సార్లు ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు.

Bandi Sanjay : నాకు చాలా హ్యాపీగా ఉంది, రేవంత్ రెడ్డి గొప్ప ఫైటర్- ఓటమిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay On BJP Defeat

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, బీజేపీ ఓటమిపై బండి సంజయ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మూర్ఖత్వపు ప్రభుత్వం పోయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. బీర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ వ్యతిరేకత ‌కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని విశ్లేషించారు.

ఇక, తెలంగాణలో బీజేపీని గుర్తించారని చెప్పారు. కరీంనగర్ లో తన ఓటమిపై బండి సంజయ్ స్పందించారు. మూడు‌సార్లు తన ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందన్నారు. కరీంనగర్ లో‌ ముస్లింలందరూ ఒకటయ్యారని చెప్పారు. బండి ‌సంజయ్ ‌మీద ముస్లింలు కక్ష కట్టారని ఆరోపించారు. దారుసలేం ఆదేశాలతో తనకు వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. మూడు‌సార్లు ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారాయన.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

43, 289 బూతులలో‌ కౌంటింగ్ చేయలేదని, తాను ఫిర్యాదు చేసిన తర్వాతే లెక్కపెట్టారని బండి సంజయ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అనుమానాలు ఉన్నాయన్నారు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ‌పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు బండి సంజయ్. రేవంత్ రెడ్డిని‌ కేసీఆర్ అనేక ఇబ్బందులు పెట్టారని బండి సంజయ్ వాపోయారు.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

ముస్లింలు అంతా ఒక్కటై మూడుసార్లు ఓడించారు..
”హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం మాట్లాడిన బండి సంజయ్ ను ముస్లింలంతా ఒక్కటై ఓడగొట్టాక హిందువులంతా ఆలోచించుకోవాలి. ముస్లింలు అంతా ఒక్కటై మూడోసారి కూడా బండి సంజయ్ ను ఓడగొట్టారంటే కరీంనగర్ లో ని హిందూ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. బండి సంజయ్ కు గెలుపోటములు కొత్త కాదు. గెలుపు ఓటముల మీద ఆధారపడి పని చేయను. గెలిచినా పని చేసినా, ఓడినా పని చేసినా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే బండి సంజయ్ ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి అభినందనలు. రేవంత్ రెడ్డి పెద్ద ఫైటర్. కేసీఆర్ ఏకైక టార్గెట్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్. మేమిద్దరమే ఆయన టార్గెట్. నన్ను, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన ఫైటర్. అందులో ఎలాంటి అనుమానం లేదు” అని బండి సంజయ్ అన్నారు.