TS Inter Result 2026 : ఇంటర్ విద్యార్థులకు బిగ్‌అలర్ట్.. ఫలితాలు కాస్త ఆలస్యం.. కారణాలు ఇవే.. ఎప్పుడు ప్రకటిస్తారంటే?

TS Inter Result 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TS Inter Result 2026

  • తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
  • ఇంటర్ ఫలితాలు కాస్త ఆలస్యం
  • ఈనెల మూడో వారంలో ఫలితాలు
  • ఇంటర్ బోర్డు సన్నాహాలు

TS Inter Result 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈనెల 10 లేదా 12వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ విద్యామండలి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, పలు కారణాల వల్ల పలితాలు ఆలస్యం అవుతాయని తెలుస్తోంది.

Also Read : Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు దంచికొట్టనున్న వానలు.. పిడుగులు పడతాయ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఫలితాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాతే విడుదల తేదీలపై నిర్ణయం తీసుకోవాలని ఇంటర్ విద్యామండలి అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో కాకుండా.. ఏప్రిల్ మూడోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసినప్పటికీ, ప్రతి విద్యార్థి జవాబు పత్రాన్ని పున:మూల్యాంకనం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ మరో రెండుమూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఆ తరువాత ఫలితాల ప్రకటనకు సంబంధించిన అసలు ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఇంటర్ ఫలితాల విడుదల సమయంలో ఎదరైన చేదు అనుభవాలను ఈసారి పునరావృతం కాకుండా ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లకుండా చూసేందుకు డబుల్ చెక్ పద్దతిని అమలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే సాంకేతిక పరమైన లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి మూల్యాంకనం పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా చూడటం కోసం అధికారులు మరోసారి ఫలితాలను చెక్ చేస్తున్నట్లు తెలిసింది. మరీముఖ్యంగా కేవలం ఒకటి, రెండు మార్కుల తేడాతో, అలాగే ఒకే ఒక్క పేపర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు మరింత శ్రద్ధగా చెక్ చేస్తున్నారట. అలాంటి విద్యార్థుల జవాబు పత్రాలను మరొకసారి లెక్కిస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.