TSPSC Group-4 Exam: గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, బంగారు ఆభరణాలు ధరించి వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. చేతి మీద టాటూలు, గోరింటాకు ఉన్నా, షూ వేసుకొని వచ్చినా నో ఎంట్రీ.

TSPSC Group 4 Exam (File Photo)

Group-4 Exam 2023 Telangana: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) గ్రూప్ -4  పోస్టుల భర్తీకి శనివారం రాత పరీక్ష జరుగుతుంది. ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు 9లక్షల 51 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం టీఎస్‌పీఎస్‌సీ తెలంగాణ వ్యాప్తంగా 2,878 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో ఎల్లుండి సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. జులై 8న రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. 8,180 గ్రూప్ 4 పోస్టులకు శనివారం పరీక్ష జరుగుతుంది.

ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి..

– పరీక్షా కేంద్రానికి 15 నిమిషాల ముందుగానే చేరుకోవాలి. సమయం దాటిన తరువాత వస్తే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థికి అనుమతి ఉండదు.
– ఎలక్ట్రానిక్ పరికరాలు, బంగారు ఆభరణాలు ధరించి వచ్చే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. చేతి మీద టాటూలు, గోరింటాకు ఉన్నా పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ.
– పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు షూలు ధరించి పరీక్షా కేంద్రంలోకి రావొద్దు. కేవలం చెప్పులతో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
– అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తరువాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
– ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్న తరువాత ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాలి.
– అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు పరీక్షకు హాజరైతే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, సదరు అభ్యర్థిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు కమిషన్ తెలిపింది.
– హాల్ టికెట్, ప్రశ్నాపత్రం నెంబరు సరిగా రాయకున్నా, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు