Site icon 10TV Telugu

TSRTC: భక్తులకు శుభవార్త.. అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

TSRTC Special Buses for Arunachal Giri Show every Full Moon

Arunachalesvara Temple: తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరిప్రదర్శన చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న గిరి ప్రదర్శనకు తొలిసారిగా నడిపిన సూపర్ లగ్జరీ బస్సులకు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలోని పౌర్ణమికి రద్దీని బట్టి హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపేలా ఏర్పాట్లు చేసింది.

Bengal Panchayat Polls: బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను మరోసారి చావు దెబ్బకొట్టిన టీఎంసీ!

అరుణాచలేశ్వరుని గిరి ప్రదర్శన ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే భక్తులను అక్కడికి చేర్చనుంది. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా ఆన్‭లైన్‭లో ఈ అరుణాచల గిరి ప్రదర్శన బస్సు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‭తో పాటు జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అరుణాచలానికి చేరుకుంటాయి. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‭కు వెళ్తాయి. అక్కడ దర్శనానంతరం తిరుగుపయనమవుతాయి.

“టీఎస్ఆర్టీసీ తొలిసారిగా గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొదట ఒక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయగా.. నిమిషాల్లో సీట్లన్నీ బుకింగ్ అయ్యాయి. దీంతో రద్దీని బట్టి సర్వీసులను పెంచడం జరిగింది. మొత్తంగా 32 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి.. దాదాపు 1100 మందిని క్షేమంగా, సురక్షితంగా అరుణాచలం గిరి ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. వారంతా కాణిపాకం విఘ్నేశ్వరునితో పాటు వెల్లూరులోని గొల్డెన్ టెంపుల్‭నూ దర్శించుకోవడం జరిగింది. అరుణాచల గిరిప్రదర్శనకు మంచి స్పందన నేపథ్యంలో ప్రతి నెల పౌర్ణమికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అవసరమైతే ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉంది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా.. సంస్థ అధికారిక వెబ్‭సైట్ www.tsrtconline.in ను సందర్శించి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి’’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు.

Exit mobile version