Bandi Sanjay: మేము గురువుల కాళ్లు బరాబర్ మొక్కుతాం.. మీలా చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళం కాదు.. కేటీఆర్‌కు బండి సంజయ్ మాస్ కౌంటర్

‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Union minister bandi sanjay counters mass counter to ktr

Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అమిత్ షా కాళ్లు మొక్కడం, చెప్పులు మోయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్’ విమర్శలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సంస్కారం, క్రమశిక్షణ నేర్పిన గురువుల కాళ్లు భవిష్యత్తులోనూ మొక్కుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ లాగా కాళ్లు గుంజి చెప్పులు ఎత్తుకుపోయే మనస్తత్వం తమది కాదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Police Recruitment: ఏపీ నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త.. 1,156 పోస్టుల భర్తీకి AP SLPRB భారీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు మీకోసం

ఫోన్ ట్యాపింగ్, బిల్లుల పెండింగ్‌పై కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు:

కేటీఆర్ దృష్టిలో దోచుకోవడం, భార్యాభర్తల బెడ్రూం సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడమే ‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా’ అని బండి సంజయ్ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమవడం, సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించడమేనా గౌరవప్రదమైన ప్రవర్తన అని ప్రశ్నించారు. ప్రజలకు అసలైన విలువలు తెలుసు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ఫాంహౌస్‌కు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ, ‘భారత్ సమ్మిట్’ ఖర్చుపై కాంగ్రెస్‌కు చురకలు:

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఒక చెల్లని రూపాయి అని, ఆయనకు ప్రధాని అయ్యే అర్హతే లేదని వ్యాఖ్యానించారు. పొరపాటున ఆయన ప్రధాని అయితే దేశాన్ని ముక్కలు చేస్తారని ఆరోపించారు. అలాగే ‘భారత్ సమ్మిట్’ పేరుతో ప్రధాని మోదీని, ఆరెస్సెస్‌ను విమర్శించినప్పటికీ, కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాని కలిశారని చెప్పారు. సమ్మిట్ కోసం రూ.100 కోట్లు వృథా చేసే బదులు, ఆ నిధులను గిగ్ వర్కర్ల బోర్డుకు ఇచ్చి ఉంటే కార్మికులకు ఎంతో మేలు జరిగేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.