Vaddepalli Municipality: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. హస్తం పార్టీ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
వడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు 8మంది కౌన్సిలర్లు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
- Naveen
- Published On : February 14, 2026 / 06:19 PM IST
Cm Revanth Representative Image (Image Credit To Original Source)
Vaddepalli Municipality: మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఫలించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. వడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు 8మంది కౌన్సిలర్లు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నియోజకవర్గం ఇంచార్జ్ సంపత్ కుమార్ వెంట పెట్టుకుని వచ్చారు. ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమక్షంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో నిలిచిన అభ్యర్థులు గెలిచింది ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలోనే. మొత్తం 10 వార్డులకు 8 వార్డులు కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ పై పోటీ చేసింది.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వారంతా సీఎంను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీ AIFB కౌన్సిలర్లు…
కుర్వ పావని, 1వ వార్డు
శారద, 2వ వార్డు
మంజుల, 4వ వార్డు
యుగేందర్ రెడ్డి, 5వ వార్డు
దేవమ్మ, 6వ వార్డు
విజయ్ భాస్కర్, 7వ వార్డు
జయశ్రీ, 8వ వార్డు
ఎరుకల తిమ్మప్ప, 10వ వార్డు
Also Read: ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుపై ఎస్ఈసీ స్పష్టత.. ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే?
