Municipal elections : ఎక్స్అఫీషియో సభ్యుల ఓటుపై ఎస్ఈసీ స్పష్టత.. ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే?
Municipal elections : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.
SEC
- ఎక్స్అఫీషియో అర్హతపై ఎస్ఈసీ కీలక ఉత్తర్వులు
- ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కడైనా ఓటు వేయొచ్చు
- రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీల్లోనే ఓటు వేయాలి
Municipal elections : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాటీల్లో, కార్పోరేషన్లలో విజయం సాధించింది. అయితే, పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఆ మున్సిపాలిటీల్లో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. తాజాగా.. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యూలర్ విడుదల చేసింది.
Also Read : Brs Candidate Kidnap: కొత్తగూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం..!
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చునని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ ప్రాంతంలో ఓటరుగా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ తెలిపింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు.
ఇదిలాఉంటే.. మేయర్, చైర్మన్ ఎన్నికలపై ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్-2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫారం-II నోటీసు కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
