Road Accident
Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎస్సార్ నగర్ ప్రాంతంలో వర్ణ కారు బీభత్సం సృష్టిస్తుంది. ఈఎస్ఐ ఆసుపత్రి లైన్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందుగా స్కూటీని ఢీకొట్టి అదే వేగంతో మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
రోడ్డుపై ఉన్న వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటనలో 8 నెలల పసికందుకు సైతం గాయాలు అయినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
క్షతగాత్రులను హస్పిటల్ కు పంపించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: ఇకనుంచి యాక్సిడెంట్ ఫొటోలు,వీడియోలు తీస్తే జైలుకే..ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్