×
Ad

Manchu Vishnu : ఆకాశంలో దూసుకొచ్చిన క్షిపణులు.. హడలిపోయిన మంచు విష్ణు ఫ్యామిలీ.. భయంతో.. వీడియో వైరల్..

Manchu Vishnu : దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆకాశంలో మిసైల్ దూసుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు.

Manchu Vishnu

  • ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్
  • దుబాయ్‌లో కుటుంబంతో మంచు విష్ణు
  • ఆకాశంలో మిసైల్ దూసుకెళ్తున్న వీడియో పోస్టు 
  • ఇల్లు కంపించింది.. ఆ క్షణంలో తీవ్ర భయానకంగా అనిపిందని వెల్లడి

Manchu Vishnu : ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. ధీంతో ఇరు దేశాల మధ్య పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. ఈ సమయంలో దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆకాశంలో మిసైల్ దూసుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు.

Also Read : Iran vs Israel War : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మృతి.. ఫ్యామిలీ మొత్తాన్నీ లేపేశారు.. వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ ఇరానియన్ల సంబురాలు

మిసైల్ పేలుడు కారణంగా మా ఇల్లు షేక్ కావడం వల్ల మేము తీవ్రంగా భయపడ్డాం. శాంతికోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా తమ ఇళ్ల పైకప్పు‌పైన యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్భలమైనదో గుర్తు చేస్తాయి. శక్తి, శాంతి కోసం పార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్ అంటూ మంచు విష్ణు తన ట్వీట్‌ను ముగించారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎదుర్కొనే భయాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.