Voter Registration : 18 ఏళ్లు నిండాక కొత్త ఓటరు ఈ లిస్టులో పేరు ఎక్కించుకోవచ్చా? సమస్యలుంటే ఎవరిని సంప్రదించాలి?
Voter Registration : 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్త ఓటర్ ఇప్పుడు ఓటర్ల జాబితాలో పేరు ఎక్కించుకోవచ్చా? ఓటర్ల వివరాలు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- June 24, 2026 / 08:56 PM IST
Voter Registration
Voter Registration : మీకు ఇంకా ఓటు హక్కు రాలేదా? మీ వయస్సు 18 ఏళ్లు నిండి తర్వాత కొత్తగా ఓటు పొందాలంటే? ఏం చేయాలి? ప్రస్తుత ఓటర్ సమగ్ర సవరణ జాబితాలో కొత్త ఓటర్ పేరు లిస్టులో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా? ఓటరు వివరాలు లేదా ఫారమ్ నింపడంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ఎవరికి అడగాలి? ఎక్కడ సాయం పొందాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్త ఓటరు బూత్ స్థాయి అధికారి ఇచ్చే ఫారం 6తో పేరు రిజిస్ట్రేషన్ కోసం డిక్లరేషన్ ఫారమును నింపాలి. కచ్చిత ఫారమును BLO అందిస్తారు. ఈ ఫారమును 31/07/2026 నుంచి 30/08/2026 వరకు ప్రారంభమయ్యే క్లెయిములు, అభ్యంతరాల సమయంలో సంబంధిత అసిస్టెంట్ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ERO) పరిశీలిస్తారు. ఆ తర్వాతే మీ పేరు ఆ కొత్త లిస్టులో చేరుతుంది.
ఈ ఏడాదిలో లేదా తర్వాత 18 ఏళ్లు నిండితే పేరుకోసం ఎలా అప్లయ్ చేయాలంటే.. ముందుగా ఓటరు లిస్టులో పేరు చేర్చేందుకు 01/10/2026 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే ఓటరు కూడా ఇంటింటి గణన కోసం ఎన్యూమరేషన్ బూత్ స్థాయి అధికారి నుంచి ఫారం 6, డిక్లరేషన్ ఫారం నింపి ఆపై సమర్పించవచ్చు. ఆయా దరఖాస్తులను సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలిస్తారు. మీరు అర్హులుగా తేలితే మీ పేర్లు ఫైనల్ ఓటర్ లిస్టులో చేరుతాయి.
ఫారమ్, ఓటరు వివరాల సమస్యలపై ఎక్కడ సాయం పొందాలి? :
ప్రతి ఇంటిని సందర్శించే బూత్ స్థాయి అధికారులు (BLOs) ఫారమును నింపడంతో పాటు ఓటరు వివరాలు వెల్లడించడంలో కూడా సాయం చేస్తారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారు.
ఒకవేళ టోల్ ఫ్రీ ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ (1950)ను కూడా సంప్రదించవచ్చు లేదా https://voters.eci.gov.in వెబ్‌సైట్ / ECINET యాప్‌లో ‘Book a Call with BLO’ సదుపాయాన్ని వినియోగించవచ్చు.
