Enumeration Form : ఎన్యూమరేషన్ ఫారమ్ అందలేదా? అదేలా నింపాలి? ఓటర్ల లిస్టులో పేరు ఎలా చెక్ చేయాలి? పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్
Enumeration Form : ఎన్యూమరేషన్ ఫారమ్ అందకపోతే ఏం చేయాలి? ఫారమ్ నింపడం రాకుంటే ఎవరిని అడగాలి? ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? పూర్తి గైడ్
Enumeration Form Process
Enumeration Form : మీకు ఓటర్ల సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారమ్ అందలేదా? ఒకవేళ ఫారమ్ అందినా మీకు అది ఎలా నింపాలో తెలియదా? సర్ 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో మీకు తెలియదా? ఎలా చెక్ చేయాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? సాధారణంగా ఈ మూడు పరిస్థితులు ఓటర్ సవరణ ప్రక్రియలో ఎదురవుతాయి. ప్రతి ఒక్కదానికి మీరు ఏమిమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎన్యూమరేషన్ ఫారం (EF) రాకపోతే ఏం చేయాలి? :
ఎన్యూమరేషన్ ఫారం మీ ఇంటికి రాకపోయినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ దగ్గర బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ని సంప్రదించండి. వారే ఫారం మీకు అందజేస్తారు లేదంటే పూర్తి వివరాలను చెబుతారు.
- ఆన్లైన్లో ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- https://voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి.
- అక్కడ ఎన్యూమరేషన్ ఫారం సెక్షన్లోకి వెళ్లండి.
- మీ వివరాలు ఎంటర్ చేసి ఫారం పొందండి.
- మీరు ఇంట్లో లేని సమయంలో మీ కుటుంబంలోని ఏ పెద్ద (18+ వయస్సు ఉన్న) సభ్యునికి కూడా ఫారం అందుతుంది.
- మీకు ఫారం అందకపోతే నేరుగా ఇలా ట్రై చేయండి.
- https://ceotelangana.nic.in లో BLO కాంటాక్ట్ నంబర్ చూడండి
- లేదంటే ECINET యాప్‌లో ‘Book a Call with BLO’ ఆప్షన్ ఎంచుకోండి.
- BLO మీకు కాల్ చేసి సాయం చేస్తారు
ఎన్యూమరేషన్ ఫారం నింపలేకపోతే ఏం చేయాలి? :
- ఫారం నింపడం కష్టమైతే మీరు ఓటర్ సవరణ సిబ్బంది సాయం పొందవచ్చు.
- బీఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫారం ఎలా నింపాలో పూర్తిగా వివరిస్తారు.
- మీరు ఇంకా ఫారమ్ పూర్తి చేయలేకపోతే BLO మళ్లీ మీ ఇంటికి వచ్చే సమయంలో సాయం చేస్తారు.
- మీరు ఒంటరిగా ఫారం నింపాల్సిన పనిలేదు. BLO ఫీల్డ్ మీకు సపోర్ట్ ఇస్తారు.
- అవసరమైతే మీ కుటుంబ సభ్యులు కూడా మీతో కలిసి ఫారం నింపవచ్చు.
SIR 2002 ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? :
- మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
- https://ceotelangana.nic.in, https://voters.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- ముందుగా (Search by Elector Details) అనే ఆప్షన్ ఎంచుకోండి
- మీ పేరు, తండ్రి పేరు, వయస్సు లేదా ఇతర వివరాలు ఎంటర్ చేయండి
- సెర్చ్ బటన్ ట్యాప్ చేస్తే.. మీ పేరు లిస్టులో ఉందో లేదో కనిపిస్తుంది.
- మీ పోలింగ్ బూత్ వివరాలు తెలిస్తే.. పార్ట్ వారీ PDF ఓటర్ లిస్ట్‌లో కూడా మీ పేరు చూడొచ్చు
- హార్డ్ కాపీ అవసరమైతే, మీ BLO దగ్గర SIR 2002 ఓటర్ లిస్ట్ ఉంటుంది. మీకు వారే సాయం చేస్తారు
